పేదలకు అండగా నివేదితా రెడ్డి

– ఎన్ఎస్ఆర్ పౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు
– నిరుపేద కుటుంబాలకు అన్నదానం
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, పెద్దవూర మండలం సంగారం గ్రామానికి చెందిన మాతంగి రాజ రత్నం  అనారోగ్యం తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా ఎన్ఎస్ ఆర్ పౌండేషన్ ఛైర్మెన్, బీజెపి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇంచార్జి కంకణాల నివేదిత రెడ్డి అంత్యక్రియలు అనంతరం శుక్రవారం భోజనాలు పంపించడం జరిగింది.ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి తన పౌండేషన్  ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని పిలుపునిచ్చారు. ఈసందర్బంగా మాట్లాడుతూ మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమే నని
భగవంతుడు ఇచ్చిన సంపదలో నాలో దైవత్వాన్ని అలవరుచుకొని దానధర్మాలు చేస్తున్నాను  అన్నారు.నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love