నవతెలంగాణ-నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నిజామాబాద్, బోధన్ పట్టణాలకు తాగునీటి అవసరాల నిమిత్తం ఆలీ సాగర్ కు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిసరాలలోని ప్రజలు ఎవరు కూడా కాల్వలో దిగవద్దని, పశువులు, గొర్రెలను కూడా కాల్వలో దించవద్దని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ నుండి విడుదల చేస్తున్న నీటిని కేవలం బోధన్, నిజామాబాద్ ప్రజల త్రాగునీటి అవసరాల కొరకు మాత్రమే ఉపయోగించుకోవాలని, సాగునీటి అవసరాల కొరకు రైతులు వినియోగించుకోవద్దని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 7.200 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిజాంసాగర్ నీటి విడుదల: ఏఈఈ సాకేత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



