Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధైర్యంగా కంటి ఆపరేషన్లు చేయించుకోండి

ధైర్యంగా కంటి ఆపరేషన్లు చేయించుకోండి

- Advertisement -

కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ 
కంటి పరీక్షలు చేయించుకుని కంటి ఆపరేషన్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరు ధైర్యంగా కంటి ఆపరేషన్లు చేయించుకోవాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శంకర కంటి ఆస్పత్రి ఫీనిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. వైద్య శిబిరానికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క మహిళలను, వృద్ధులను ఆత్మీయంగా పలకరించి, వ్యక్తిగత బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ఆపరేషన్ అవసరం లేని వారికి  పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు కూడా ఇస్తామన్నారు. ఆపరేషన్లకు వెళ్లేవారు టెన్షన్ పడకుండా, భయపడకుండా ఉంటేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుందని సూచించారు. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 9766 మందికి కంటి పరీక్షలు చేయించి, 2198 మందికి ఆపరేషన్లు పూర్తి చేయించామని, 4227 మందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేశామని ఆమె గుర్తు చేశారు. వేలమందికి ఆపరేషన్ చేయించామని, మునుముందు ఇంకా చేయిస్తామని, ఆపరేషన్లకు ఎంపికైన వారు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించి, స్వయంగా ఆమె భోజనం వడ్డించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -