నవతెలంగాణ- నల్లగొండ: విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ఆదేశానుసారం పాఠశాలల్లో ప్రతి నాల్గవ శనివారం రోజున నిర్వహించే నో బ్యాగ్ డే సందర్భం పురస్కరించుకుని పరీక్షల కాలం కారణంగా ముందస్తుగా బాల్ భవన్ ఆధ్వర్యంలో లలిత కళలు పోటీలు యం ఏ యం ఉన్నత పాఠశాల యందు బాల బాలికలకు నేడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాద్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు రేణుక దేవి, ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత అధ్యాపకుడు కార్యక్రమ దాత హమీద్ ఖాన్, డాక్టర్ గోవర్దన్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక కళ అయినా నేర్చుకుంటే భవిష్యత్తుకి మేలు జరుగుతుంది అని, నృత్యo సంగీతం కళల శిక్షణ ద్వారా స్టూడెంట్స్ లో దాగిన నైపుణ్యాలను వెలికి తీయడం తో పాటు వ్యాయామం అవుతుంది దాంతో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు, రాగాలు తీస్తున్నప్పుడు శ్వాస ప్రక్రియ ఎక్కువ జరిగి మెదడుకి శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుందని,ఆర్ట్ క్రాఫ్ట్ వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది తద్వారా ఆరోగ్యం మెరుగయి విద్యలో కూడా చురుకు అవుతారు అని అన్నారు.తదుపరి స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన ,విజేతలకు సర్టిఫికెట్ లు అందజేయడం జరిగింది ,అనంతరం అతిథులకు శాలువాతో ఘనంగా సన్మానించారు బాల్ భవన్ పర్యవేక్షకులు బండి రాధాకృష్ణ రెడ్డి, దాసరి ఎల్లయ్య, ఉమా,సత్యనారాయణ సింగ్,సాయి చరణ్, బండారు వీరయ్య ,స్కూల్ ఇతర సిబ్బంది,స్టూడెంట్స్ పాల్గొన్నారు .