ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – నిజం సాగర్
నిజం సాగార్ మండల పరిషత్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు మరియు బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి గారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుర్గా రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు తండ్రి లాంటివాడని ఒకవేళ తెలంగాణను సాధించకపోతే తెలంగాణలోని ప్రజల బ్రతుకులు దయనీయంగా ఉండేవని ఆయన అన్నారు. ప్రతి ఒక్క యువ నాయకునికి కెసిఆర్ గారు ఆదర్శమని ఆయన కొనియాడారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆశించాడు.ఈ కార్యక్రమంలో మల్లూరు సొసైటీ చైర్మన్ విట్టల్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love