
కాటారం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘము చైర్మన్ చల్లా నారాయణరెడ్డికి పదవి గండం ఎదురుకానున్నట్లుగా తెలుస్తోంది.పాలకవర్గం సభ్యులు అవిశ్వాసం దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా విశ్వసనీయత సమాచారం. పాలకవర్గంలోని 11 మంది డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టేందుకు ప్రత్యేక క్యాంపునకు తరలినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును హైదరాబాద్ లో కలిసి రెండు, మూడు రోజుల్లో డైరెక్టర్లు తమ అవిశ్వాస తీర్మానాన్ని సంబంధించిన ఉన్నతాధికారులకు అందజేసే అవకాశాలున్నాయి. కాగా ఫిబ్రవరి 15,2020న పిఏసిఎస్ ఎన్నికలు జరుగగా 13మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. ధన్వాడ నుంచి చల్లా నారాయణరెడ్డి పోటీ చేసి గెలుపొందారు.బిఆర్ఎస్ పార్టీతో గెలిసిన డైరెక్టర్లు ఎక్కువగా ఉండడంతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన నారాయణరెడ్డి పదవిని సొంతం చేసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో నారాయణరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ బిపామ్ తో మంథని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాగైనా పిఏసిఎస్ పీఠాన్ని కాంగ్రెస్ నాయకులు తమ ఖాతాలో వేసుకోవడానికి పలుమార్లు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ డైరెక్టర్ల మద్దతుతో రహస్యంగా భేటియై కాంగ్రెస్ డైరెక్టర్లకు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇచ్చేలా ఒకతాటిపైకి తీసికొచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో డైరెక్టర్ల మద్దతు సాధించిన కాంగ్రెస్ నాయకులు అవిశ్వాస ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లుగా తెలిసింది. బీఆర్ఎస్ మద్దతు డైరెక్టర్లు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తిర్టం పుచ్చుకొనున్నట్లుగా తెలుస్తోంది. పిఏసిఎస్ చైర్మన్ పదవీకాలం మరో ఏడాది ఉండగా కాంగ్రెస్ కు చెందిన డైరెక్టర్లలో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.