ప్రీ పెయిడ్‌ మీటర్లు వద్దు

–  విద్యుత్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పుదుచ్చేరిలో భారీ ర్యాలీ
పుదుచ్చేరి : విద్యుత్‌ వినియోగానికి ప్రీ పెయిడ్‌ మీటర్లను పెట్టాలని పుదుచ్చేరి ప్రభుత్వం చేస్తున్న కసరత్తును వ్యతిరేకిస్తూ ‘చలో సెక్రటేరియట్‌’ పేరుతో సిపిఎం సోమవారం భారీ ర్యాలీ చేపట్టింది. సిపిఎం పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి రాజనగం ఈ ర్యాలీకి నేతృత్వం వహించగా, పొలిట్‌బ్యూరో సభ్యులు జి రామకృష్ణ, కన్నూర్‌ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు. విద్యుత్‌ రంగంలో ప్రయివేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎన్‌ రంగస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే ప్రీ పెయిడ్‌ మీటర్ల ప్రణాళికలను విరమించుకోవాలని, విద్యుత్‌ ప్రయివేటీకరణ చర్యలు మానుకోవాలని కోరారు. పుదుచ్చేరి, మహే, కారైక్కల్‌, యానాం ప్రజలకు అందుబాటులో రేషన్‌ దుకాణాలు తెరవాలని, సబ్సీడీపై ఆహారాన్ని అందించాలని కోరారు.

Spread the love