నోముల భగత్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు

– టీపీసీసీ కార్యదర్శి కర్నాటి లింగారెడ్డి
నవతెలంగాణ – నాగార్జునసాగర్
అవగాహన రాహిత్యంతో మతిభ్రమించి మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ మాట్లాడుతున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాన ని టీపీసీసీ సెక్రెటరీ కర్నాటి లింగారెడ్డి అన్నారు. బుధవారం నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ.ఈ 19 క్వార్టర్స్ ఖాళీ చేయించడంలో రాజకీయ దురుద్దేశం కానే కాదని కేవలం అధికారులు న్యాయబద్ధంగా చేసిన కార్యక్రమమని అన్నారు. ఈ.ఈ 19 క్వార్టర్స్ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా అలర్ట్ అయిందని దానిలో కేవలం స్థానిక ఎమ్మెల్యే మాత్రమే విధులు నిర్వహించాలని అది ఎవరి వ్యక్తిగత నివాసం కాదని అన్నారు. ఎమ్మెల్యే పదవి కాలం అయిపోయిన వెంటనే అట్టి క్యాంపు కార్యాలయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే విధుల నిర్వహణకు కార్యాలయాన్ని అప్పగించాలని కానీ మాజీ ఎమ్మెల్యే భరత్ కుమార్ ప్రభుత్వానికి విరుద్ధంగా తన పార్టీ కార్యకలాపాలకు కొనసాగిస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.ఎన్ఎస్పీ అధికారులు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన స్పందించకుండా అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఖాళీ చేయకపోవడంతో ఆర్డీవో స్థాయి అధికారులు చట్ట ప్రకారం ఖాళీ చేయించడం జరిగిందని తెలిపారు. కానీ మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి కర్నాటి లింగారెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డి వారి నివాసాలలో ఏ విధంగా ఉంటున్నారు అని అడుగుతున్నారని కానీ అతను తెలుసుకోవాల్సిన విషయం నాకు 1993 సంవత్సరం నుండి ప్రభుత్వంతో ప్రైవేట్ వ్యక్తిగా అలాట్మెంట్ ఉందని నేను ఈ.ఈ 16క్వార్టర్ లో నివాసం ఉంటున్నాని తెలిపారు. కానీ మాజీ ఎమ్మెల్యే భరత్ కుమార్ క్యాంపు ఆఫీస్ కి మాత్రమే అలాట్మెంట్ అయింది కానీ వ్యక్తిగతంగా అలాట్మెంట్ కాలేదని దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని అన్నారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు సింగిల్ విండో చైర్మన్ గుంటకల్ వెంకట్ రెడ్డి,50 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, మంగతా నాయక్, వైస్ చైర్మన్ ప్రత్యేక సలహాదారుడు ఆదాసు విక్రం,3వ వార్డు కౌన్సిలర్ ప్రత్యేక సలహాదారుడు రమావత్ మోహన్ నాయక్,కాంగ్రెస్ నాయకులు ఉంగరాల శ్రీనివాస్,తుమ్మలపల్లి రంగారెడ్డి ,పగడాల నాగరాజు, మోహన్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love