హైదరాబాద్: నగర కేంద్రంగా పని చేస్తోన్న సువెన్ ఫార్మా కంపెనీ, కోహాన్స్ లైఫ్ సైన్సెస్‌లో విలీనానికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఇటీవల ఆమోదం తెలిపాయని ఆ సంస్థలు వెల్లడించాయి. సంయుక్తంగా ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు చేయనున్నట్లు తెలిపింది. 12-15 నెలల్లో విలీన ప్రక్రియను పూర్తి చేయాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ప్రక్రియ జరుగుతుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. సువెన్ ఫార్మాలో అడ్వెంట్‌కు 50.1 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత ఉమ్మడి సంస్థలో అడ్వెంట్‌కు 66.7 శాతం ఈక్విటీ వాటా ఉండనుంది.