జాతర సేవలో ఎన్ఎస్ఎస్

నవతెలంగాణ-తాడ్వాయి 
తెలంగాణ కుంభమేళగా పేరొందిన సమ్మక్క సారక్క మేడారం జాతర లో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు విశేష సేవలందిస్తున్నారు.  దదాపు ఐదు రోజుల నుండి  కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు జాతరలో భక్తులకు సేవ చేస్తున్నారు . సుమారు 200 మంది   ఆరు విభాగాలుగా  ఏర్పడి  డా .రఘువేందర్ రెడ్డి, (అబ్దుల్ కలామ్) ,హెచ్ రాజేశ్వార్ రావు (భగత్ సింగ్)  డా ప్రవీణ్ (గాంధీ)  బానోత్ వాలీయ నాయక్ (సుభాష్ చంద్రబోస్) రజనీకర్ (శీవాజీ) రాజ్ కమార్(నేహ్రు)ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ల ఆధ్వర్యంలో  పని చేస్తున్నారు. పోలీస్ విభాగానికి రక్షణలో తోడుగా తప్పిపోయిన భక్తులను వారి వారి గమ్య  స్థానాలకు చేరుస్తూ, నీరసంతో పడిపోతున్న భక్తులను దగ్గరలోని వైద్యశాలకు చేరవేస్తూన్నారు. అంతే కాదు క్యూ లైన్లో భక్తులకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తు జాతరకు సంబంధించిన అన్ని రకాల విభాగాల్లో తమవంతుగా సహాయం అందిస్తున్న కాకతీయ విశ్వవిద్యాలయ  ఎన్ఎస్ఎస్ విభాగం యొక్క పనితీరు అభినందనీయం.
Spread the love