కేటీఆర్ రోడ్ షోకు ఫ్లకార్డులతో NSUI నిరసన

నవతెలంగాణ-చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలో కేటీఆర్ రోడ్ షోకు బుధవారం నిరసన సెగ తగిలింది. చౌటుప్పల్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీని మర్చిపోయారని నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ మొకం పెట్టుకొని ఓట్లు అడుగుతారని రాచకొండ భార్గవ్ అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కచ్చితంగా ఓడగోడుతామని హెచ్చరించారు. ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న సందర్భంలో రాచకొండ భార్గవ్, పున్న శివ, ఎర్ర శ్రవణ్, ఎర్ర దిలీప్, ఐతరాజు శ్రీకాంత్ లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.

Spread the love