Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయాగరాజ్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు 

ప్రయాగరాజ్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు 

- Advertisement -

టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి 
నవతెలంగాణ -పెద్దవంగర : ప్రయాగరాజ్ నగరంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బిక్షపతి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన నాయకుడిగా ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని వ్యాఖ్యానించారు. దేశానికి, ఉమ్మడి రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రయాగరాజ్ కు వెళ్లిన నాయకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలను అక్కడే నిర్వహించారు. కార్యక్రమంలో వేముల రఘు, సోమ వీరన్న, ఓరిగంటీ మహిపాల్, బైన శ్రీనివాస్, దుంపల ఉప్పలయ్య, తోట ఉపేందర్, పెద్ది మధు, పెద్ది రాములు, గుండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -