ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి

– కాకులమర్రి లక్ష్మణ్ బాబు బి ఆర్ ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు
– బిఆర్ఎస్‌ పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
నవతెలంగాణ-గోవిందరావుపేట : రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని బి ఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. సోమవారం మండలంలోని లక్నవరం పంచాయతీ  దుంపెలగూడెం  గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజశేఖర్,వైస్ ఎంపీపీ సూది రెడ్డి స్వప్న లక్ష్మ రెడ్డి ల, ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబుఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు సూరపునేని సాయికుమార్, ల సమక్షంలో వివిధ పార్టీల నుండి  “50” మంది బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది,పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించినారు.ఈ సందర్భంగా ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు  మాట్లాడుతూ కేసీఆర్‌  పాలనలో అన్నివర్గాలకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని,,తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్‌ గారి ప్రభుత్వం గొప్పగా పాలిస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్‌ గారి దార్శనిక పాలనతో ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.గోవిందరావుపేట మరియు ములుగు జిల్లా ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారని,పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం,స్థానం ఉంటుందన్నారు.బిఆర్ఎస్ పార్టీని నమ్మి చేరిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని,నాయకులకు,కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని సూడి  శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్,పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, సర్పంచ్ భూక్య వాణి రాజు నాయక్,సర్పంచుల ఫోరం గోవిందరావుపేట అధ్యక్షులు మోహన్ రాథోడ్, తొలి మలిదశ ఉద్యమకారుడు ఉద్యమకారుల సంఘం గోవిందరావుపేట అధ్యక్షులు అజ్మీర సురేష్, రైతు కోఆర్డినేటర్ పన్నాల శ్రీరామ్ రెడ్డి,సూడి సమ్మిరెడ్డి, సీనియర్ నాయకులు భుఖ్య రాజు, యూత్ కమిటీ అధ్యక్షులు జన్ను రాంబాబు,,యు వెంకన్న, వి వెంకన్న, ఎం మధు, బి శ్రావణ్, ఎస్ సాగర్,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love