అంగన్వాడీ కేంద్రం లో పోషణ పట్వాడ

నవతెలంగాణ – పెద్దవూర
అంగన్‌వాడీలు కేంద్రంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని అనుముల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. మంగళవారం మండలంలోని చలకుర్తి సెక్టారు పరిధిలోని నాయినవాని కుంట తండ, నాయినవాని కుంట అంగన్‌వాడీ కేంద్రంలో  పోషణ పట్వాడ, పోషణమాసం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సూపర్ వైజర్ మాట్లాడుతూ గర్భిణీలు తీసుకోవాల్సిన పోషక  నియమాలను గురించి వివరించారు.  ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు  గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు నారాయణమ్మ,అంజమ్మ, ఆయాలు శౌరి, అదేమ్మ, ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు జహీద బేగం, మాజీ సర్పంచ్ రమావత్ జానీ, అంజలి, సరిత, స్వాతి, అనూష, మంజుల, వైశాలి, లలిత, శ్రీను, భర్మ, గణేష్, సిపాయి, మౌనిక,పాల్గొన్నారు.
Spread the love