తెలంగాణ స్పీకర్, చైర్మెన్‌తో భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఒడిశా అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ సుధీర్ రంజన్ పథజోషి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కౌన్సిల్ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి , డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాష్ స్వాగతం పలికారు. శుక్రవారం శాసనమండలి సమావేశ మందిరంలో పుష్పగుచ్ఛం శాలువాలతో సత్కరించారు. మెమోంటోలు బహూకరించారు. ఇందులో శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఇతర లెజిస్లేటివ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల శాసనసభలలో కమిటీల ఏర్పాటు, పనితీరుపై సమావేశంలో చర్చ జరిగింది.
ఒడిశా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



