Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ ఆవరణలో 
ఘనంగా బోనాల పండుగ

అసెంబ్లీ ఆవరణలో 
ఘనంగా బోనాల పండుగ

- Advertisement -

పాల్గొన్న స్పీకర్‌ ప్రసాద్‌‌కుమార్‌, చైర్మెన్‌ గుత్తా
నవతెలంగాణ-హైదరాబాద్‌

‌రాష్ట్ర శాసనసభ ఆవరణలో ఘనంగా ఆషాడ మాస బోనాల పండుగను నిర్వహించారు. శుక్రవారం లెజిస్లేటివ్ సెక్రెటేరియట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల ఉత్సవాలలో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ ప్రకాష్ , శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా లెజిస్లేటివ్ ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించగా, పోత రాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, వివిధ వేషధా రణలతో కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు ఉత్సవాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మెన్‌, స్పీకర్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -