నవతెలంగాణ-కుభీర్
గత నెల రోజుల నుంచి మండలంలో ఏదో ఒకచోట వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీంతో మంగళవారం మండలంలో ని దార్ కుబీర్, పల్సి గ్రామాలలో మొక్కజొన్న పసుపు ఐల్ ఫామ్ పంటలు ప్రమాదవశత్తు అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో బుధవారం మండల రెవెన్యూ అధికారులు పంట క్షేత్రాలను పరిశీలించి, దార్ కుభీర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దాదాపుగా 15 ఎకరాల్లో మొక్కజొన్న పసుపు పంట దగ్ధమైనట్లు పరిశీలించారు. ఇందులో దాదాపుగా 8 లక్షల వరకు రైతులకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
అదేవిధంగా పాలసీ గ్రామనికి చెందిన శ్రీరాముల రాజేష్ అనే రైతుకు సంబంధించిన 31 ఆయిల్ ఫామ్ మొక్కలు ప్రమాదవ శత్తు దగ్ధం కావడంతో వాటి విలువ రూ.29800 నష్టం జరిగినట్లు అధికారులు నివేదికలు తయారుచేసి ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు ప్రమాదవశక్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వివిధ కారణాలవల్ల మొక్కజొన్న పసుపు ఆల్ఫామ్ తదితర పంటలు దగ్ధం కావడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ ఐ లు నరేష్, శ్రీనివాస్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మహేష్, చరణ్, ఆర్టికల్చర్ అధికారి మోహినుద్దీన్,గ్రామస్తులు రైతులు తదితరులు ఉన్నారు.



