భారీ వర్షానికి నేలమట్టమైన ఇల్లు.. ఆలస్యంగా స్పందించిన అధికారులు..

నవతెలంగాణ – లోకేశ్వరం
రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని హవర్గ గ్రామానికి చెందిన వడ్నాల భూమేశ్ ఇల్లు ఆదివారం రాత్రి కుప్పకూలింది. ఇల్లు ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. కూలిన వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఇల్లు కూలిపోవడంతో చుట్టూ పక్కల వాళ్ళ ఇంట్లో తలదాచుకున్నమని నిత్యావసర సరుకులు, బట్టలు పూర్తిగా తడిసిపోయాయని, దాతలు ఎవరైనా స్పందించి చేయూత నందించాలని తమకు పునారావాసం కల్పించాలని కోరారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆర్కా మొతిరాం సోమవారం సందర్శించి కూలిన ఇల్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు ఆర్ఐ లు బాలకిషన్, లలిత, పంచాయతీ కార్యదర్శి అరుణ్, రెవిన్యూ సిబ్బంది, మాజీ సర్పంచ్ బుజంగ్ రావు, ఉన్నారు.

Spread the love