జాతర లో అధికారులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి 

– చిలకలగుట్ట సందర్శన
– ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ కుంభమేళా అయినా మేడారం జాతర లో అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం మేడారం లోని ఐటిడిఏ క్యాప్ ఆఫీస్ లో ఆర్ డబ్ల్యు ఎస్  అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అధికారులు  అందుబాటులో ఉండాలని అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ముఖ్యంగా మూత్రశాలలు , నీళ్ళ సౌకర్యం నిరంతరం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిలకల గుట్ట ను సందర్శించారు. జాతర సమయంలో  చిలకల గుట్ట పరిసర ప్రాంతాలలో రద్దీ , అమ్మవారిని తీసుకువచ్చే సమయం లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ , పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు , స్థానిక ఎమ్మార్వో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love