Monday, June 29, 2026
E-PAPER
Homeసినిమా'జై భీమ్` తరువాత మరోసారి

‘జై భీమ్` తరువాత మరోసారి

- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో హీరో సూర్య, నటి కాయదు లోహర్, దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబి నేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది.
దర్శకుడు టి.జే.జ్ఞానవేల్ ‘జై భీమ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, ‘సూర్య, టి.జే. జ్ఞానవేల్ తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే నిజాయితీగల, అర్థవంతమైన కథను చెప్పబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది` అని అన్నారు.
ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కె. కదిర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
ఈ చిత్ర ముహూర్త కార్యక్రమం సోమవారం చెన్నైలోని పార్క్ హయత్ హోటల్‌లో ఘనంగా జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -