వన్‌ స్టాప్‌ ఆర్ట్‌ షాప్‌

One Stop Art Shopఅద్భుతమైన చిత్రకళా సంపద విశ్వ నగరవాసులను పలకరించేందుకు మరోసారి వచ్చింది. ప్రముఖ చిత్ర కళాకారుల కుంచెతో రూపుదిద్దుకున్న అబ్బురపరిచే కళాఖండాలు హైదరాబాద్‌ నగరవాసులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 4 నుండి 6 వరకు రేతిబౌలిలో పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే (పిల్లర్‌ నెంబర్‌ 68) సమీపంలో ఉన్న కింగ్స్‌ క్రౌన్‌ కన్వెన్షన్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 8 గంటల వరకు జరుగుతుంది. చార్మినార్‌ నగరిలో సుసంపన్నమైన సాంస్కతిక అనుభూతిని పంచుతుంది.
2011 నుండి న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబయిలో ఏటా నిర్వహిస్తున్నారు. వందలాది మంది కళాకారుల వేలాది కళాఖండాలు ఈ ప్రదర్శనలో కనువిందు చేస్తున్నాయి.
30 ఎడిషన్లు విజయవంతంగా నిర్వహించింది. ఆర్ట్‌ గ్యాలరీతో పాటు స్వతంత్ర కళాకారుల కళాకతులకు కూడా చోటు కల్పించే వినూత్నమైన ఫార్మాట్‌తో పదిహేనేళ్లుగా స్థాయి, నాణ్యతతో పాటు పరిధిలో కూడా ఇంతింతై అన్నట్టుగా గణనీయంగా ఎదుగుతూ వచ్చింది. కళాకతుల సందర్శన, కొనుగోళ్లను అందరికీ మరింత అందుబాటులోకి తేవాలన్న ఆర్ట్‌ ఫెస్టివల్‌ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ వేదికయింది.
ఈ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో 25 ఆర్ట్‌ గ్యాలరీలు, 50 మంది దిగ్గజ కళాకారులతో పాటు 200 మంది ప్రముఖ, యువ, ఔత్సాహిక కళాకారుల కళాఖండాలు కనువిందు చేస్తున్నాయి.
100 ఎయిర్‌ కండిషన్డ్‌ స్టాల్స్‌లో కొలువుదీరిన 3,500 వైవిధ్యమైన పెయింటింగ్‌లు, శిల్పాలు సందర్శకులకు కనులపండుగ చేస్తున్నాయి.
అందరికీ అందుబాటులో కళాకతులు
”కళాకారులు తమ నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకోవడానికి, సరికొత్త మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, భిన్న రంగాలకు చెందిన ప్రేక్షకుల ఎదుట తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది చక్కటి వేదిక అయింది. దేశవ్యాప్తంగా ఆర్ట్‌ స్కూల్స్‌ నుండి ఏటా వేలాది మంది కొత్త కళాకారులు పట్టభద్రులై వస్తున్నారు. కానీ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు గ్యాలరీ వేదికలు దొరకక ఇబ్బంది పడుతున్నారు. అంతేగాక మన దేశంలోని రెండు లక్షల మందికి పైగా కళాకారులకు అవసరమైనన్ని ఆర్ట్‌ గ్యాలరీలు లేవు. తమ ఇళ్లను చక్కని సజనాత్మక కళాఖండాలతో అందంగా అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరే నగర యువతకు ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌ చక్కని వేదికగా నిలిచింది. లోతైన అర్థాలను ప్రతిబింబించే వేలాది కళాకతులను ఒకేచోటికి చేర్చే ‘వన్‌-స్టాప్‌ ఆర్ట్‌ షాప్‌’గా వారికి చిత్రకళపై ఉన్న మక్కువను తీరుస్తోంది. యువ, మిడ్‌-కెరీర్‌ కళాకారులు తమ కళాకతులను పలువురు దిగ్గజ కళాకారులతో పాటుగా ప్రదర్శించడానికి ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌ వీలు కల్పించింది. ప్రస్తుత ఆర్ట్‌ మార్కెట్‌ పరిస్థితుల్లో ఇది వాళ్లకు ఎంతో కష్టం. అందరికీ సమానావకాశాలు కల్పించడమే మా లక్ష్యం” అని ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌ లక్ష్యాలను డైరెక్టర్‌ రాజేంద్ర వివరించారు.
వైవిధ్యంతో కూడిన చార్మినార్‌ నగరిలో రెండోసారి జరుగుతున్న ఈ ఆర్ట్‌ ఫెస్ట్‌లో ముంబై, న్యూఢిల్లీ, గుర్గావ్‌, సింగపూర్‌, హైదరాబాద్‌, బెంగళూరు తదితర నగరాలకు చెందిన 100 మంది దిగ్గజ, ప్రసిద్ధ కళాకారులు పాలొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కాక దాదాపు ప్రతి రాష్ట్రానికి చెందిన కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ప్రముఖ కళాకారులు…
ప్రముఖ కళాకారులు జోగెన్‌ చౌదరి, మను పరేఖ్‌, క్రిషేన్‌ ఖన్నా, శక్తి బర్మన్‌, సీమా కోహ్లీ, పరేశ్‌ మెయితీ, యూసుఫ్‌ అరక్కల్‌, ఎస్‌ జి వాసుదేవ్‌, అంజోలీ ఎలా మీనన్‌, అతుల్‌ దోడియా, లక్ష్మా గౌడ్‌, టి వైకుంఠం, అశోక్‌ భౌమిక్‌, లాలు ప్రసాద్‌ షా, గురుదాస్‌ షెనారు, జతిన్‌ దాస్‌, పి జ్ఞాన, రమేశ్‌ గోర్జాల, శివ ప్రసన, ఎం నారాయణ్‌ తదితర ప్రముఖ కళాకారుల కళారూపాలు ప్రదర్శనలో కనువిందు చేస్తున్నాయి.
వీరేగాక చింతల జగదీశ్‌, గిగి సర్కారియా, ఎంవి రమణా రెడ్డి, లక్ష్మణ్‌ ఏలె, పిజె స్టాలిన్‌, ఆసిఫ్‌ హుస్సేన్‌, వివేక్‌ కుమావత్‌, భాస్కర్‌ రావు, యూసుఫ్‌, అమిత్‌ భార్‌, కప్పరి కిషన్‌, జి ప్రమోద్‌ రెడ్డి, సుభాష్‌ బాబు, సచిన్‌ జల్తారే, ఎస్‌ కాంతా రెడ్డి, గణపతి హెగ్డే, ప్రవీణ్‌ కుమార్‌, కాంతి ప్రసాద్‌ ఆరె తదితరులు తమ సజనాత్మక కళాకతులను ప్రదర్శిస్తున్నారు. కళా రంగంలో పేరు తెచ్చుకుంటున్న ప్రవీణ పారేపల్లి, ఓం తడ్కర్‌, పంకజ్‌ బావ్డేకర్‌, దేవ్‌ మెహతా, ప్రవీణ్‌ ఉపాధ్యారు, సంజరు అష్ట పుత్రే, సత్య గౌతమన్‌ వంటివారు కూడా భాగం అయ్యాయి.
సాంస్కతిక వైభవం
ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌ ఎడిషన్‌ కేవలం కనులవిందు మాత్రమే కాదు. పలు రకాల ఫ్యూజన్‌ షోలు, లైవ్‌ మ్యూజిక్‌ షోలు, పెయింటింగ్‌ ప్రదర్శనలు, కట్టిపడేసే చలనచిత్ర ప్రదర్శనలను ఆహ్వానితులు ఆస్వాదించవచ్చు. ‘ది ఎటర్నల్‌ కాన్వాస్‌ – 12,000 ఇయర్స్‌ జర్నీ త్రూ ఇండియన్‌ ఆర్ట్‌’ ప్రదర్శన కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. పూర్వ చారిత్రక యుగం నుండి నేటివరకు సుసంపన్నమైన భారత కళా వారసత్వాన్ని, ఘనతను ఈ చిత్రం కళ్లకు కడుతోంది.
వేడుకలో భాగమవండి
హైదరాబాద్‌ ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌ 2025 వైవిధ్యం, సజనాత్మకత, కళాత్మక వ్యక్తీకరణల ఉత్సవంగా, కాలాతీతమైన కళాత్మక అభివ్యక్తికి వేదికగా అలరిస్తుంది. ఈ అద్వితీయ సాంస్కతిక సంరంభానికి ఆస్వాదించడానికి కళాప్రియులు, కళా ఖండాలు సేకరించే వారు, ప్రేక్షకులు అందరూ ఆహ్వానితులే.
ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌కు ప్రవేశం అందరికీ ఉచితమే. ఇందులో పాల్గొంటున్న ఆర్ట్‌ గ్యాలరీలు…
హైదరాబాద్‌: ఆర్ట్స్‌బ్రీజ్‌ ఆర్ట్‌ గ్యాలరీ, గ్యాలరీ సెలెస్టే, ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, స్నేహా ఆర్ట్స్‌, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ
బెంగళూరు: చార్వి ఆర్ట్‌ గ్యాలరీ, సారా అరక్కల్‌ గ్యాలరీ
న్యూ ఢిల్లీ, ఎన్‌ సీఆర్‌: ఆరా ప్లానెట్‌, ఎమోటివ్‌ ఆర్ట్‌ గ్యాలరీ, గ్యాలరీ ఆర్ట్‌ ఎట్‌ఉచాన్‌
ముంబై: ఆర్ట్‌దేశ్‌ ఫౌండేషన్‌, బియాండ్‌ ది కాన్వాస్‌, చిత్రాకాశ్‌, హౌస్‌ ఆఫ్‌ ఎమర్జ్‌, నిత్య ఆర్టిస్ట్‌ సెంటర్‌, స్టూడియో పంకజ్‌ బావ్డేకర్‌, ది బాంబే ఆర్ట్‌ సొసైటీ, రిథమ్‌ ఆర్ట్‌, ఆర్‌ ఎస్‌ ఆర్ట్‌ స్పేస్‌
ఇతర నగరాలు: అరీతి ఆర్ట్‌ స్టూడియో (పానిపట్‌), జ్ఞానీ ఆర్ట్స్‌ (సింగపూర్‌), ఎక్స్‌క్లూజివ్‌ ఆర్ట్‌ గ్యాలరీ (బరోడా), ఎం నారాయణ్‌ స్టూడియో (పుణే).
– వి.యశోద,
8332995427

Spread the love