Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలి

రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలి

- Advertisement -

– తహశీల్దార్ నరేష్ 
– ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఫర్టిలైజర్ షాపుల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని తహసిల్దార్ నరేష్ అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ తో కలిసి ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.కేవలం నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని, లేబిల్ లేని లూస్ విత్తనాలు అమ్మకూడదని ఫర్టిలైజర్ షాపుల యాజమానులను హెచ్చరించారు. రైతులు కూడా విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని, పంటకాలం పూర్తయ్యేవరకు రసీదులను భద్రపరుచుకోవాలని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ సూచించారు. మండలంలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -