కైరో ప్రాక్టీస్ సెంటర్ ప్రారంభం

నవతెలంగాణ – ఆర్మూర్  

మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో  హెల్త్ కేర్ ఫిజియో రిహబ్ లో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రమేష్ చేతుల మీదుగా కైరో ప్రాక్టిక్స్ సెంటర్ ను ఆదివారం ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొట్టమొదటి కైరో ప్రాక్టిక్స్ సెంటర్ ను ఆర్మూర్ ప్రాంతంలో ప్రారంభించడం చాలా ఆనందదాయకమన్నారు. కైరో ప్రాక్టిక్స్, ఆస్తియోపతి అనే అడ్వాన్సు చికిత్స ద్వారా వెన్నుపూసకు సంబంధించిన స్లిప్ డిస్క్, సియాటికా, స్పాండిలైటిస్, లాంటి వెన్నుపూసకు సంబంధించిన అన్ని సమస్యలకు తక్కువ సమయంలోనే తగ్గించుకునే ఆస్కారం ఉందన్నారు. డాక్టర్ సతీష్  ఫిజియోథెరపిస్ట్ మాట్లాడుతూ ఈ కైరో ప్రాక్టిక్స్ అస్థియోపతి అనే అడ్వాన్స్ చికిత్స ద్వారా చాలా ఉపయోగకరమైనది అన్నారు . ప్రాంత ప్రజలు వినియోగించుకోగలరని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి సాయి ప్రతాప్ ,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love