నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులందరికీ పాఠశాల యూనిఫామ్ కుట్టుటకు అదే మండలంలో గల ఐకెపికి వారికి అందించడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యత్వం ఉన్న నిరుద్యోగ యువతులకి ఉపాధి మార్గం కల్పించే విధంగా ఉంటుందని ,నిరుపేద కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వo ఐకెపి కి ఇవ్వడం చాలా సంతోషకరమని అలాగే ఐకెపి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లలో కుట్టి యూనిఫామ్ దుస్తులను సంబంధించిన పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని ఐకెపికి అందించడం చాలా శుభసూచకముని ఏపీఎం మోహన్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిలు హరిబాబు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.