వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నవతెలంగాణ – ఉప్పునుంతల 

ఉప్పునుంతల మండలంలోని సోమవారం ఐదు గ్రామాలలోని ఉప్పరపల్లి, కంసానిపల్లి, తాడూరు, మామిళ్ళపల్లి, పెనిమెల్ల గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ ఐకెపి సమాఖ్య సంఘాల ద్వారా కలిసి సెంటర్లను ప్రారంభించినట్లు ఏపీఎం సైదులు తెలిపారు. వడ్లు క్వింటాల్ ధర ఏ గ్రేడ్ రకానికి 2203 రూ, బి గ్రేడ్ రకానికి 2183 రూపాయలుకు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. వరి దాన్యంలో తేమశాతం 14% ఉండేటట్లు చూసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు గమనించి దళారులను ఆశ్రయించి వారి చేతిలో మోసపోకుండా మీ యొక్క వరి ధాన్యాన్ని తేమశాతాన్ని తగ్గించి, వరి ధాన్యాన్ని శుభ్రపరచి ప్రభుత్వ కనీస మద్దతు ధరకు అమ్ముకోవాలని రైతులకు ఏపీఎం సైదులు కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సాద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సైదులు తోపాటు పంచాయతీ కార్యదర్శి రాజేష్, మహిళా సంఘాల మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love