– కెసిఆర్ సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ను గెలిపిస్తాయి.
ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయండి.
– పేదవాలు గా దళితులలో బీసీలలో అధికంగా ఉన్నారు. అందరికీ దళిత బంధు పథకం.
– బీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి.
నవతెలంగాణ – భువనగిరి: పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్ ను గెలిపిస్తాయని భువనగిరి నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక సాయిబాబా గుడి నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు కని విని ఎరుగని రీతిలో బీఆర్‌ఎస్ శ్రేణులు డప్పు, డోలు, బ్యాండు, మేళాలతో, డక్కీ వాయిద్యాలతో, గిరిజనుల, యువతుల నృత్యాలతో జై తెలంగాణ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర బీఆర్‌ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ కొలుపుల అమరేందర్లు, మరో వాహనంలో పైళ్ల శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత, కూతురు మాన్వితారెడ్డిలు ఓటర్లకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. భారీ బాణసంచా పేపర్, షాట్స్ పేల్చారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి అతని భార్య ముందు నడుచుకుంటూ వచ్చి కరచలనం చేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంతో ఆర్డీవో కార్యాలయానికి ఎమ్మెల్యే నామినేషన్ వేయడానికి వెళ్లారు. అతనితోపాటు మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, కొలుపుల అమరేందర్, జడల అమరేందర్, చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాటి తెలంగాణ రాష్ట్రంలో అనేక కష్టాలు పడ్డారని నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కష్టాల నుండి బయటకు వచ్చారని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని పీక తినేందుకు రాబందుల మాదిరిగా ప్రతిపక్షాలు వస్తున్నాయని తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు ఆలోచించి విజ్ఞప్తితో తమ ఓటు వినియోగించుకోవాలని కోరారు ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రాన్ని ప్రజలను అగాధంలోకి తోసివేసే విధంగా కుట్రలు పన్నుతున్నారని తెలిపారు కేసీఆర్ మాదిరిగా పరిపాలన చేసే ప్రతిపక్షాలకు చేతన కాదని తెలిపారు. ఆ పార్టీలలో కెసిఆర్ తో సరితూగే నాయకుడే లేడని వివరించారు. పొరపాటు జరుగుతే మరో 20 ఏళ్లు రాష్ట్రం వెనుకబడి పోతుందని తెలిపారు. ధనికులలో ఉన్న పేద వారికి కూడా విద్యను ఉచితంగా అందించడానికి కేసీఆర్ చొరవ చూపుతున్నారన్నారు అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం వస్తుందని తెలిపారు. ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు మిగిలిన పనులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్కు బాధ లేదని తెలిపారు. రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు. తతగటగర్భఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి నాటి సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన తెలంగాణ లో అందరూ ఉద్యోగించి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నామన్నారు నాటు ఎన్నికలకు నేటి ఎన్నికలకు ఎన్నో మార్పులు వచ్చాయన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నడిపించాలని విజ్ఞప్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్, గోమారి సుధాకర్, ఎడ్ల రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.