మన ప్రత్యర్థి పాత వెస్పా మోడల్‌.. నేను స్పోర్ట్స్‌ బైక్‌ లాంటి వాడిని

– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌
నవతెలంగాణ-ఖమ్మం
రానున్న ఎన్నికల్లో మన ప్రత్యర్థి పాత వెస్పా మోడల్‌ లాంటి వాడు.. నేను స్పోర్ట్స్‌ బైక్‌ లాంటి వాడిని, మీకు పాత మోడల్‌ వేస్పా కావాలా.. కొత్త మోడల్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కావాలా అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్‌ హల్‌లో యువజన జిల్లా నాయకుడు గాదె అనిల్‌కుమార్‌ అధ్వర్యంలో యువజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థి బండి వంచి కిక్‌ కొట్టాలని, అయిన స్టార్ట్‌ కాదు, నేను సెల్ఫ్‌ స్టార్ట్‌ లాంటి వాడిని, నేను మీ చేతిలో బటన్‌ లాంటి వాడిని నొక్కితే వెంటనే మీకు కావాల్సిన అభివృద్ధి చేస్తాని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి మధ్యలో ఉన్నవాడే నాయకుడు అని, మున్నేరు వరదల సమయంలో నువ్వెక్కడ ఉన్నావ్‌, నేను అర్ధరాత్రి వరకు ఎనీఆర్‌ఎఫ్‌ బందంతో వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడిన నా ప్రజలను నేను కాపాడుకున్న అని తెలిపారు. కారు గుర్తు మన గుర్తు.. ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్లి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భిరెడ్డీ నాగచంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవి, కార్పొరేటర్‌ నాగండ్ల కోటి, యర్రంశెట్టి రవి, గొర్రె శ్రీను, సత్యవర్ధన్‌ రెడ్డి, మండల యూత్‌ అద్యక్షుడు విజరు రెడ్డి, వలి, జాని, కాంపాటి రవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love