ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి..

Outsourcing employees should be hired.– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రభుత్వ పాలిటెక్నిక్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏవో ప్రశాంత్ కి పాలిటెక్నిక్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏవో  సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా నందిపేట్ కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ లో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు తొలగించారు. పాలిటెక్నిక్ లో కొత్తగా వచ్చిన ఏవో ప్రిన్సిపాల్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు చాలామంది అధికారులు ఒచ్చుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు ఎవరు వారి మీద ఎలాంటి అభియోగాలు పెట్టకుండా ప్రశంసలు పొందారు, కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఏవో వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న సర్వీసులో ఇలాంటి రిమార్కు లేకుండా పనిచేసిన కార్మికులను తొలగించే దాంట్లో మతలబు ఏమిటి? కార్మికుల జీవన ఉపాధి పైన దెబ్బతీయడం అంటే కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డట్టే అవుతుంది. వారిపైనే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరైనది కాదని అన్నారు. సమస్యను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని పాలిటెక్నిక్ వద్ద టెంటు వేసి అక్కడే నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూదేవి, హనుమందాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love