ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు పాదయాత్ర

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మెన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ-మల్హర్‌రావు
మంథని నియోజకవర్గ ప్రజా సమస్యలను, కష్టాలను తెలుసుకొని తక్షణమే పరిస్కారం చేయ డానికే ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించినట్లు మంథని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి పెద్దతూండ్ల మీదుగా కొయ్యుర్‌ వరకు ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వారసత్వ రాజకీయాలు లేకుండా ఓ పేద బిడ్డ రాజకీయంగా ఎదిగితే ఓర్వే లేక పోతున్నారని, 15ఏండ్లుగా మంథని నియోజక వర్గంలోని పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకుంటే కొందరు నిందారోపణలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ కేంద్రంగా తనపై కుట్రలు, కుతంత్రా లకు తెరలేపుతున్నారని అన్నారు. కుల సంఘాలు, మీడియా సంస్థలు పని గట్టుకుని తనను బదనాం చేస్తున్నాయన్నారు. 2014లో ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. మానేరుపై బ్రిడ్జి, పెద్దతూండ్ల, షాత్రాజ్‌ పల్లి బ్రిడ్జిలు, సీసీ రోడ్లు,కిషన్‌ రావు పల్లి నుంచి భూపాలపల్లి వరకు రోడ్డు కోసం అటవీశాఖ నుంచి అనుమతులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలాన్ని అభివృధ్ది పథంలో నడిపించినట్టు చెప్పానరు. ప్రస్తుతం కొన్ని గృహలక్ష్మీ ఇండ్లు మాత్రమే వచ్చాయని ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు వచ్చేలా చేస్తానన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకులు కాగితాలను పంచుతున్నారని, వారి హయాంలో అభివృధ్ది పనులు ఎందుకు చేయ లేదని ప్రశ్నించారు. ఓట్లు వస్తేనే కాంగ్రెస్సోళ్లకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంథని ప్రాంతంలోని ప్రతిపేద బిడ్డకు రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువుల బాధ్యత తనదేనని ప్రకటించారు. 2014లో మంథని నియోజకవర్గానికి వెలుగులు వచ్చినట్లే వచ్చి మళ్లీ పోయాయని, ఈసారి ప్రజల ఆశీర్వాదంతో మంథని ప్రాంతానికి వెలుగులు రావాలని, శాశ్వతంగా ఉండా లని కోరారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జెడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేసే నాయకుడు పుట్ట మధన్నారు. ప్రజా క్షేత్రంలో నిరంతరం ఉంటే మన బిడ్డల భవిష్యత్‌ కోసం ఆలోచన చేసే నాయకుడిని కాపాడుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ స్పూర్తితో పాదయాత్ర
తెలంగాణ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ స్పూర్తితో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర చేపట్టినట్లు మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మదుకర్‌ అన్నారు. పాదయాత్రలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నిజాం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకం గా పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిని, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మహదేవపూర్‌: మంథని నియోజక వర్గం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టిన విషయం విధితమే మంగళవారం ఆయనకు మద్దతుగా భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీ హార్షిని రాకేష్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయ కులు జక్కు రాకేష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాస రావు, సర్పంచ్‌ శ్రీపతి బాపు పెండ్యాల మనోహర్‌ తడకల రమేష్‌ తదితర కార్యకర్తలు పుట్ట మధు ప్రజా యాత్రలో పాల్గొన్నారు.

Spread the love