చిరంజీవి, వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్‌

chiranjeeviఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సంద‌ర్భాంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్‌ జననాయక్‌, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ (మరణానంతరం) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

పద్మవిభూషణులు వీరే..
వైజయంతి మాల బాలి (కళారంగం) – తమిళనాడు
కొణిదెల చిరంజీవి (కళారంగం) – ఆంధ్రప్రదేశ్‌
వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు) – ఆంధ్రప్రదేశ్‌
బిందేశ్వర్‌ పాఠక్‌ ( సామాజిక సేవ)- బిహార్‌
పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు

‘పద్మభూషణ్‌’లు వీరే..

ఎం.ఫాతిమా బీవి (ప్రజా వ్యవహారాలు) – కేరళ
హర్మస్‌జీ ఎన్‌ కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
మిథున్‌ చక్రబర్తి (కళలు) – పశ్చిమ బెంగాల్‌
సీతారామ్‌ జిందాల్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) – కర్ణాటక
యువాంగ్‌ లీయూ (వాణిజ్యం, పరిశ్రమలు) – తైవాన్‌
అశ్విన్‌ బాలచంద్‌ మెహతా (వైద్యం) – మహారాష్ట్ర
సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) – పశ్చిమ బెంగాల్‌
రామ్‌ నాయక్‌ (ప్రజా వ్యవహారాలు) – మహారాష్ట్ర
తేజస్‌ మధుసూదన్‌ పటేల్‌ (వైద్యం) – గుజరాత్‌
ఓలంచేరి రాజగోపాల్‌ (ప్రజా వ్యవహారాలు) – కేరళ
దత్తాత్రేయ అంబాదాస్‌ మయాలు (కళలు) – మహారాష్ట్ర
తోగ్దాన్‌ రిన్‌పోచే(మరణానంతరం) (ఆధ్యాత్మికం)- లద్ధాఖ్‌
ప్యారేలాల్‌ శర్మ(కళలు) – మహారాష్ట్ర
చంద్రేశ్వర్‌ ప్రసాద్‌ ఠాకూర్‌ (వైద్యం) – బిహార్‌
ఉషా ఉతప్‌ (కళలు) పశ్చిమబెంగాల్‌
కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ (మరణానంతరం) (కళలు) – తమిళనాడు
కుందన్‌ వ్యాస్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర

తొలుత అన్‌సంగ్‌ హీరోస్‌ పేరిట 34మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించగా.. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు ఉన్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డుల జాబితా విడుదలైనప్పటికీ పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌ అవార్డులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

పద్మశ్రీ అవార్డులు- కళారంగం

డి. ఉమామహేశ్వరి – ఆంధ్రప్రదేశ్‌
గడ్డం సమ్మయ్య – తెలంగాణ
దాసరి కొండప్ప – తెలంగాణ
జానకీలాల్‌ – రాజస్థాన్‌
గోపీనాథ్‌ స్వైన్‌ – ఒడిశా
స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర
ఓంప్రకాశ్‌ శర్మ – మధ్యప్రదేశ్‌
నారాయణన్‌ ఈపీ – కేరళ
భాగబత్‌ పదాన్‌ – ఒడిశా
సనాతన్‌ రుద్ర పాల్‌ – పశ్చిమ బెంగాల్‌
భద్రప్పన్‌ ఎం – తమిళనాడు
జోర్డాన్‌ లేప్చా – సిక్కిం
మచిహన్‌ సాసా – మణిపుర్‌
శాంతిదేవీ పాసవాన్‌, శివన్‌ పాసవాన్‌ – బిహార్‌
రతన్‌ కహార్‌ – పశ్చిమ బెంగాల్‌
అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ – బిహార్‌
బాలకృష్ణన్‌ సాధనమ్‌ పుథియ వీతిల్‌ – కేరళ
బాబూ రామ్‌యాదవ్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌
నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ – పశ్చిమ బెంగాల్‌

సామాజిక సేవా రంగం

సోమన్న – కర్ణాటక
పార్బతి బారువా – అస్సాం
జగేశ్వర్‌ యాదవ్‌ – ఛత్తీస్‌గఢ్‌
ఛామి ముర్మూ – ఝార్ఖండ్‌
గుర్విందర్‌ సింగ్‌ – హరియాణా
దుఖు మాఝీ – పశ్చిమ బెంగాల్‌
సంగ్థాన్‌కిమా – మిజోరం

వైద్యరంగం

హేమచంద్‌ మాంఝీ – ఛత్తీస్‌గఢ్‌
యజ్దీ మాణెక్‌ షా ఇటాలియా – గుజరాత్‌
ప్రేమ ధన్‌రాజ్‌ – కర్ణాటక

క్రీడారంగం
ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే – మహారాష్ట్ర

ఇతర రంగాలు
యనుంగ్‌ జామోహ్‌ లెగో – అరుణాచల్‌ ప్రదేశ్‌
సర్బేశ్వర్‌ బాసుమతరి – అస్సాం
సత్యనారాయణ బెలేరి – కేరళ
కె.చెల్లామ్మళ్‌ – అండమాన్‌ నికోబార్‌

Spread the love