మెండుగా పోహకాలు.. పీచు పదార్థాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం అవడానికి తాటిముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి.మండే ఎండలకు విరుగుడుగా పని చేసే తాటిముంజలు కూడా సీజన్ కూడా ప్రారంభమైంది.తాటిముంజలు,నీటిముంజలు,పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటేచాలు పల్లె,పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తూ,నోరూరిస్తాయి.తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం.తాటి ముంజలకు అంతర్జాతీయంగానూ ఎంతో పేరుంది.ఐస్ ఆపిల్ అంటూ ఆపిల్ పండ్లకు సరిసమానమైన స్థానం ఇచ్చారు.మండలంలో తాడిచెర్ల మానేరు ఒడ్డుకు, మల్లారం అరేవాగు ఒడ్డున తాటివనం ఆహ్లాదకరంగా చుట్టూ పచ్చని పొలాలతో ఉన్నాయి.
పోషకాలు మెండుగా..
పోషకాల్లో మేటి అయిన ముంజల ముచ్చట్లు తాటి ముంజలు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో అధికంగా తేమ,తక్కువ కొవ్వుదార్థాలు తక్కువగా ఉంటాయి.ఇది వేసవి తాపానికి ఉపశమనం కలిగిస్తాయి.అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,మల బద్దకాన్ని తగ్గిస్తుంది.శక్తిని ఇస్తుంది.తాటి ముంజలు వేసవి తాపానికి ఉపశమనం కలిగిస్థాయి.వేసవిలో మాత్రమే లభించే తాటిముంజలను మధుర ఫలంగానూ పేర్కొం టారు. ముంజల్లో 87 శాతం నీరు ఉంటుంది. వీటిలోని పోషక విలువలు వడదెబ్బ నివారణకు, శరీర ఉష్ణోగ్రతలను తగ్గించ డానికి ఉపయోగపడతాయి. తాటిముంజల లోపటి తెల్లని పదార్థం వేసవి తాపం నుంచి రక్షిస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.ఇందులో ఉన్న నీరు, కార్బోహైడ్రేట్లు ప్రొటీన్లు శరీరానికి వెంటనే శక్తినిస్తాయి. పీచు పదార్థాలు జీర్ణక్రియ మెరుగు పరు స్థాయి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ముంజ లలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతె కాకుండా తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ బరువు తగ్గడానికి కూడా సహాయ పడతాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ముంజలు చాలా మంచిది.తాటిముంజలు వేసవిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కాబట్టి వేసవిలో వీలైనంతవరకు ముంజలు తినడం మంచిది. వేసవి తాపం నుంచి ఉపశమ నానికి వినియోగదారులు తాటి ముంజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు..
ఆరోగ్యానికి మేలు: వినయ్ భాస్కర్ తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి
తాటి ముంజల్లో అధిక పాషకాలు ఉన్నాయి. ఇవి వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు పోషకాలులిస్తాయి.నీరు,కార్బోహైడ్రెడ్,ప్రోటీన్స్,పీచు పదార్థాలు ఉండడంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.



