నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా మొగిలి ఎంటర్టైన్ మెంట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో జరిగిన ఆనందో బ్రహ్మ కార్యక్రమంలో మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల రాజలక్ష్మీ ప్రముఖ జానపద గాయానికి ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ లోని రవింద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో అవార్డ్ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నాయుడు సత్యనారాయణ ముఖ్య అతిథిగా, యిమ్మడి సిల్వర్ గ్రూప్ చైర్మన్ యిమ్మడి రమేష్ , వంశీ సంస్థల వ్యవస్థాపకులు వంశీ రామరాజు , హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు డా:యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
వళ్లెంకుంట వాసికి స్వర్ణనంది పురస్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



