రేపు కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయాలి: పాపట్ల నరహరి 

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
రేపు భువనగిరి బీఆర్ఎస్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.  ఈ రోడ్ షో ను బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Spread the love