విద్యార్ధుల అభ్యసన సామర్ధ్యాలు అంచనా వేయుటకు డిసెంబర్ 4వ తేదీన నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే (పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్) ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి అమృతలూరి నాగరాజు శేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక బి.ఇ.డి. కళాశాలలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కు పరీక్ష నిర్వహణ,ఒ.యం.ఆర్. పూర్తి చేసే విధానం వంటి వాటిపై ఆయన అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలో భాగమైన జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 3,6,9 తరగతుల విద్యార్ధులకు అభ్యసన సామర్ధ్యాల అంచనా నిర్వహించబడుతుంది అని, దీనిద్వారా జాతీయ విద్యా ప్రణాళిక 2020 కి అనుగుణంగా వివిధ స్థాయిలలో విద్యార్ధుల ప్రగతిని అంచనా వేయనున్నారు అని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని బి.ఇ.డి కళాశాలల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ గా వ్యవహరిస్తున్న విద్యార్ధులకు శిక్షణను అందించడం జరిగిందని అన్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా మూల్యాంకనాన్ని నిర్వహించాలని మూల్యాంకనం పూర్తి అయిన వెంటనే సీల్డ్ కవర్ లలో మూల్యాంకన పత్రాలను మండల విద్యా వనరుల కేంద్రాలలో అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి పి.ప్రసాదరావు,బి.ఇ.డీ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రా రెడ్డి, సి.ఆర్.పి. ప్రభాకరాచార్యులు, ఐ.ఇ.ఆర్.పి రామారావు,ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ పాల్గొన్నారు.