సమస్యాత్మక ప్రాంతాలు.. కట్టుదిట్టం

– ఎన్నికల నిర్వహణకు పోలీస్‌ శాఖ సిద్ధం
–  జవహర్‌నగర్‌ సీఐ సీతారాం
నవతెలంగాణ-జవహర్‌నగర్‌
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో సమస్యాత్మక ప్రాంతాలు కట్టుదిట్టం చేశామని, పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్‌ చేశామని, ఎన్నికల్లో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నామని జవహర్‌నగర్‌ సీఐ సీతారాం అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్‌ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను సీఐ ఆదేశాల మేరకు ఎస్సైలు, సెంట్రల్‌ ఫోర్స్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఆటుపోట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవేందర్‌ నగర్‌ ప్రాథమిక పాఠశాల, నోబుల్‌ స్కూల్‌ ఏకలవ్య పాఠశాల, దేవేందర్‌నగర్‌, గబ్బిలాల్‌పేట్‌, వైఎస్‌ఆరనగర్‌, బీజేఆర్‌ నగర్‌, మల్లిఖార్జున్‌నగర్‌, సంతోష్‌నగర్‌, సుక్కమ్మకుంట, శ్రీరామనగర్‌, మార్వాడీలేన్‌, మల్కారం, డ్వాక్రాభవన్‌, ఆరుంధతీ నగర్‌, యాప్రాల్‌ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు లక్ష్మణ్‌, అనిల్‌ కుమార్‌యాదవ్‌, అనీల్‌ కుమార్‌రెడ్డి, సెంట్రల్‌ ఫోర్స్‌ పాల్గొన్నారు.

Spread the love