నేడు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు రానున్నారు. ఇక్కడ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం గంటన్నరపాటు ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవోతో కలిసి తెలంగాణ జనసేన నేతలు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డు మార్గాన బయల్దేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు.

Spread the love