పిడియస్ బియ్యం పట్టివేత కేసు నమోదు..

నవతెలంగాణ – నూతనకల్
అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యంను పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై మహేంద్రనాథ్ బుధవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బిక్కుమల్ల గ్రామ శివారు లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మరిపెడ బంగ్లా నుండి నూతనకల్ వైపు వస్తున్న ఒక బొలెరో ట్రాలీ వాహనాన్ని చెక్ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉండి 30 క్వింటాల పిడియస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నా, వారిని అదుపులోకి తీసుకొని విచారించాగా మర్రిపేట బంగ్లా చెందిన బుద్ధ శ్రీనివాస్, బొలెరో డ్రైవర్ బాదావత్ సురేష్ సహాయo తో తక్కువ ధరకు బియ్యం సేకరించి అధిక ధరలకు అమ్ముకునేందుకు వెళ్తుండగా పట్టుకొని బొలెరో వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Spread the love