Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిషపు గుళికలు తిని నెమలి మృతి

విషపు గుళికలు తిని నెమలి మృతి

- Advertisement -


నవతెలంగాణ-ఏర్గట్ల

నిజామాబాద్‌ ‌జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో విషపు గుళికలు తిని నెమలి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. వారి సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చనిపోయిన నెమలికి పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ.. కళేబరాన్ని పూడ్చివేశామని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పరిశీలించినవారిలో.. గ్రామ కార్యదర్శి రాహుల్, జీపీవో భూమన్న, అటవీశాఖ అధికారి వరుణ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -