
కాంగ్రెస్ పార్టీ పెద్ద పెళ్లి ఎంపీ టికెట్ ఆసంపల్లి శ్రీనివాస్ ఇవ్వాలని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం కొయ్యుర్ ప్రేస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గోదావరిఖని పరిసరాల ప్రాంతానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ పెద్ద పెళ్లి పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని మాదిగ దండోరా తరఫున కోరుకుతున్నట్లుగా తెలిపారు. సామాజిక అవగాహన ఉన్న వ్యక్తిగా, మంచి విద్యావంతునిగా, అన్ని రంగాల్లో ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తే మాదిగ జాతిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిగా ఆసంపల్లి శ్రీనివాస్ తో అందరం మమేకమై గెలిపించుకుంటామన్నారు.