మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: కల్లూరి మల్లేశం

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సంవత్సర కాలంగా కోడిగుడ్ల బిల్లును చెల్లించడం లేదని,  నెలల తరబడి ఇతర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల గౌరవ వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తక్షణమే ఇచ్చిన హామీనీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు  జిల్లా సహాయ కార్యదర్శి బోడ భాగ్య మాట్లాడుతూ మధ్యాహ్న బోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫామ్ ఇవ్వాలని సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ధర్నా కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకురాలు చెర్కు వసంత, మెక్యల వరమ్మ, కొంత భూలక్ష్మి, జె రమ,లక్ష్మీ, లలిత, కృష్ణ , సుభద్ర, అంజమ్మ లు పాల్గొన్నారు.
Spread the love