– ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన పెంచాలి
– ఎల్ నీ నో ను అందరం సమష్టిగా ఎదుర్కోవాలి
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామ సర్పంచ్ , ప్రజా ప్రతినిధులుగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని, మంజూరైన పనులు పెండింగ్ లో ఉంటే ఎలా అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్పంచులకు సూచించారు. బుధవారం హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల సామర్ధ్య పెంపు,ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. తాగునీటి సమస్య ,వ్యవసాయానికి ఆరుతడి పంటల పై రైతాంగానికి అవగాహన కల్పించాలని తెలిపారు.విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, రవాణా ,పంచాయతీరాజ్ , విద్యా పై అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద జిరంజి కింద ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీఛార్జి ఫిట్స్ లాంటి పనులను వినియోగించుకోవాలన్నారు.
వ్యవసాయ పొలాలకు రెండున్నర ఎకరాలు పైగా ఉన్న ఉన్న వారికి 2.5 లక్షలతో బావి తవ్వుకునే అవకాశం ఉందన్నారు. ఆయిల్ ఫాం సాగు పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సాంక్షన్ అయిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించడం లో ముందుండే గ్రామాల అభివృద్ధిలో ముందుంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు ,కిచెన్ షెడ్ కూడా జిరంజి పథకంలో కట్టుకోవచ్చన్నారు. పాఠశాలలో సమస్యలు లేకుండా పరిష్కారం చేసుకుందామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలి. పక్కనే నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంది ఆయిల్ ఫామ్ సాగు గ్రామాల్లో పెంచాలన్నారు. ప్రతి గ్రామాల్లో జల శక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వివిధ విభాగల అధికారులు
విద్యుత్ అధికారులు.. సమస్య వినరు..పనిచేయరు – గ్రామాల సర్పంచుల ఆగ్రహం
గ్రామాలలోని విద్యుత్ సమస్యలపై ఏ ఈ కి ఫోన్ చేసి సమస్య చెప్తే వినరు,, సమస్య ఎలాంటిదైనా పని చేయారని, కనీసం ఏఈకి ఫోన్ చేసిన స్పందించడం లేదని వివిధ గ్రామాల సర్పంచులు సర్వసభ్య సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట తమ ఆవేదన చేశారు. గ్రామ సభలకు విద్యుత్ అధికారులు హాజరు కారు సమస్యలు చెబితే పట్టించుకోరని తెలిపారు. మండల సర్వసభ్య సమావేశానికి కూడా హాజరు కాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.



