నవతెలంగాణ-కాశిబుగ్గ
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని వర్ధన్నపేట బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ పరి ధిలోని కొత్తపేట, ఆరేపల్లి, పైడిపల్లిలో వర్ధన్నపేట నియోజకవర్గ బిఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరూర మంగళ హారతులతో కోలాట బతుకమ్మ ఆటపాటలతో ఆరూరి రమేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి నాయ కులు యువకులు మహిళలు పార్టీలో చేరగా వారికి ఆరూరి రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి బంగారు తెలంగాణ సమగ్ర అభివద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు విమోచన చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, రైతుబంధు జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలిత యాదవ్, కార్పొరేటర్ శిభారాణి అనిల్, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, సొసైటీ చైర్మన్ ఇట్యాల హరికష్ణ నాయకులు శ్రీనివాస్, వెంకన్న, బిక్షపతి,రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరుతూ మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రాములు పర్వతగిరి మండల కేంద్రంలో శుక్రవారం గడప గడపకు తిరుగుతూ కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై అవగాహన కల్పిస్తూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం లో పర్వతగిరి స్థానిక ప్రజాప్రతినిధులు, బూత్ ఇన్చార్జిలు, 100ఓట్ల బాధ్యులు, ముఖ్య కార్యకర్త లు పాల్గొన్నారు. మండలం లోని గోరుగుట్ట తండా లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్న గెలుపు కోసం గోరుగుట్ట సర్పంచ్ బానోతు వెంకన్న నాయక్, దేవేందర్ నాయక్, బానోత్ రమేష్ నాయక్, సుమన్ నాయక్, సురేష్, 100 ఓట్ల ఇన్చార్జిలు అజ్మీరా దేవేందర్, బానోత్ రెడ్డి, బానోత్ సుమన్, బానోత్ భాస్కర్, గూగులోతు శ్రీను, బానోత్ వెంకన్న, సుధాకర్, మోహన్, కో ఆప్షన్ సభ్యుడు దేవేందర్‌లు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రాపాక రేణుక నాగయ్య, ్ ఏర్పుల శ్రీనివాస్, ఏకాంతం, జంగిల్ బాబు, ఎర్రబెల్లి వెంకటేశ్వర్ రావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అరూరికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు
మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన నారాయణపురం గౌడ్ సంఘం సొసైటీ సభ్యులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ సమక్షంలో శుక్రవారం ముకుమ్మడిగా పార్టీలో చేరి ఎమ్మెల్యే అరూరి రమేష్ కు సంపూర్ణ మద్ద తు ప్రకటించారు. ఈ సందర్బంగా పార్టీలో వారికి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పట్టాపురం ఏకాంతం గౌడ్, ఏడు దొడ్ల జితేందర్ రెడ్డి, గొర్రె దేవేందర్, ఎర్రబెల్లి వెంకటేశ్వరావు, బొమ్మర యాకాంతం, బొమ్మెర లింగమూర్తి, జనగాం యాకాంతం తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను నెంబర్ వన్ స్థానం లో నిలిపిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్ ఓటర్ల ను అభ్యర్థించారు. గ్రేటర్ 66వ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ ఎన్నికల ఇంచా ర్జి గట్టురాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచా రంలో బీఆర్‌ఎస్ నాయకులు కందుకూరి చంద్రమోహన్, పిట్టల కుమారస్వామి, వీసం సురెందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, మేకల రమేష్, బోడ యుగందర్, వల్లాల యాదగిరి, పెద్దమ్మ రమేష్, పెద్దమ్మ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
దేవన్నపేట నుంచి బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
గ్రేటర్ 65వ డివిజన్ పరిధి దేవన్నపేట నుంచి హనుమకొండ జిల్లా ఆత్మ డైరెక్టర్ పంజాల భూపాల్‌గౌడ్ ఆధ్వర్యంలో శ్రీపతివాడ యాదవ సంఘం యూత్ సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యూత్ సభ్యులు 1వ వార్డు మెంబర్ శ్రీపతి రామచందర్, శ్రీపతి హరీష్, శ్రీపతి ప్రశాంత్, శ్రీపతి రాజకుమార్, ఆవుల రాజకుమార్, ఆవుల నాగరాజు, శ్రీపతి రాజు, సల్పాల ఓదెలు, కాగిత రమేష్, గణబోయిన రాజు, శ్రీపతి శ్రీనివాస్, శ్రీపతి కుమారస్వామి, శ్రీపతి రాకేష్, శ్రీపతి రాజు, శ్రీపతి తిరుపతి, శ్రీపతి రామచందర్, మెరుగు అరవింద్, శ్రీపతి మహేష్, గనబోయిన దీపక్, కాంగ్రెస్ పార్టీ నుండి ఆరూరి రమేష్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవన్నపేట గ్రామ పార్టీ అధ్యక్షులు రాజు (మైఖేల్), మహిళా నాయకురాలు శ్రీపతి రాజక్క, కొండ నాగరాజు, కాగితోజు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.