నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన హెల్ప్ లైన్ లో ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం విద్యుత్తు సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ కోసం తప్పులను సవరించుకోవడానికి ప్రజలు బారులు తీరారు. కరెంట్ బిల్లులో జీరో అకౌంట్ రావడం లేదని కొందరు, గ్యాస్ సబ్సిడీ కోసం మరికొందరు రావడంతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం జనంతో కళకళలాడుతోంది. మండలంలో మూడు హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసినప్పటికీ జనం ఎగబడుతూ రావడంతో సిబ్బంది వారి తప్పులను సరి చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళకు కాకుండా దరఖాస్తులోని తమ తప్పులను సరి చేసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. తమ దరఖాస్తులను సరి చేసుకోవడానికి ఎలాంటి నిబంధనలు లేవని, ప్రతి ఒక్కరు సంయమానం పాటించి దరఖాస్తులను సరి చేసుకోవాలన్నారు.