ఆన్లైన్ సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : ఎస్.ఐ. సంపత్

నవతెలంగాణ – నాగార్జునసాగర్
ఆన్లైన్లో సైబర్ నేరస్తులు పొంచి ఉన్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మొబైల్ లో వచ్చే ఓ.టి.పి లను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని విజయపురి టౌన్ ఎస్.ఐ సంపత్ గౌడ్ అన్నారు. శుక్రవారంనాడు మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మాట్లాడుతూ..నందికొండ ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఓ.టీ.పీ విషయంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులైన  సీనియర్ సిటిజన్స్ కి తప్పక చెప్పాలని ఆన్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా అనగా లైవ్ వీడియోలు, ఫోటోలు,ఉచిత అక్షింతలు, విరాళాలు, ఉచిత మూల విగ్రహ దర్శనము, రైల్ టికెట్లు  పేరుతో అనేక రకాలుగా ప్రలోభ పెట్టి ఆన్లైన్ లింకులు (బ్లూ కలర్ లో కనబడతాయి) పంపుతారని, దయచేసి ఎవరూ అటువంటి లింకులు లేదా మొబైల్ యాప్లలో క్లిక్ చేయవద్దని కోరారు. అలాంటి మోసపూరిత యాప్ లను క్లిక్ చేసినచో మీ యొక్క మొబైల్ లో గల ఆన్లైన్ ఫోన్ పే,గూగుల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వ్యక్తిగత డాటా దొంగిలించి మీ అకౌంట్లో డబ్బులు మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్ ఖాళీ చేస్తారని తెలిపారు. ఫోన్ కాల్ చేసి ఓ.టి.పి అడిగారంటే అది కచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికే అని గుర్తించుకోవాలని కోరారు. అదేవిధంగా అయోధ్య నుండి ఫోన్ చేస్తున్నాము లేక మీకు దర్శనం కల్పిస్తాము, అక్షింతలు ఇప్పిస్తాము అని మీకు ఫోన్ కాల్ చేసి, ప్రలోభ పెట్టి  మీ వద్ద నుండి ఓటిపి అడిగే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ ఇతరులకు ఫోన్ ద్వారా గాని ఫోన్ కాల్ ద్వారా గాని మెసేజ్ ద్వారా గాని చెప్పకూడదని ఓ.టీ.పీ. చెప్పిన వెంటనే మీ యొక్క అకౌంటు ఖాళీ చేస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Spread the love