- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆలూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ & ఏఈఆర్ఓ ఎం. రమేష్ సోమవారం తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు మండల వ్యాప్తంగా డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రీ–ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లతో పాటు వారి కుటుంబ సభ్యుల మ్యాపింగ్ కొనసాగుతోందన్నారు. ప్రతి ఓటరు తమ బీఎల్ఓను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి బీఎల్ఓలు వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారని, ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని తహసీల్దార్ కోరారు.
- Advertisement -



