ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగo చేసుకోవాలి

నవతెలంగాణ- వలిగొండ రూరల్
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి నూతి రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని రెడ్లరేపాక, కoచనపల్లి దుప్పల్లి, నరసాపురం గ్రామాలలో ప్రజా పాలన కార్యక్రమం కొనసాగుతుంది. రెడ్లరేపాక లో ఎంపిపి పాల్గొని ప్రజల నుండి దరకాస్తులు స్వీకరించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి ప్రజల వద్దకే అధికారులను పంపి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు రేపాక అరుంధతి, కొమురెల్లి రమా బాలకృష్ణా రెడ్డి, గదగాని శోభా రాణి వెంకటయ్య, కావటి మత్స్యగిరి, ఎంపిటిసి లు నోముల మల్లేష్ , పలుసం అండాలు నర్సింహా, మండల ప్రత్యేక  అధికారి శేఖర్ రెడ్డి, ఎంపిడిఓ గీతా రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి అంజనీదేవి,  ఎపిఓ కేదారీశ్వర్, ఆర్ ఐ మనోహర్, కర్ణాకర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.
Spread the love