మరో 8 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతి

– వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక్కో కాలేజీలో 100 సీట్ల ప్రవేశ సామర్థ్యంతో యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల, నారాయణపేట్‌, మెదక్‌, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా
మరో 8 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఉత్తర్వుల జారీ పట్ల, ఇది సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన వైద్యవిద్య విప్లవమంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు అభివర్ణించారు. వైద్యకళాశాలల ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు విస్తరించాయని తెలిపారు.

Spread the love