Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంసాంకేతికత ఉపయోగంలో వ్యక్తిగత గోప్యత ముఖ్యం

సాంకేతికత ఉపయోగంలో వ్యక్తిగత గోప్యత ముఖ్యం

- Advertisement -

– ‘సాయిస్ఫూర్తి’లో ముగిసిన ఏఐ, ఐఓటీ వర్క్‌షాప్ 
నవతెలంగాణ-సత్తుపల్లి 

సాంకేతికతను  ఉపయోగించుకోవడం ముఖ్యమో, మన వ్యక్తిగత గోప్యతను భద్రపరచుకోవడం అంతే ముఖ్యమని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ, ఐఓటీ శిక్షకులు వివరించారు. సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఏఐ, ఐఓటీ   వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. ఐఈటీఈ విజయవాడ, కిట్స్‌కార్ట్ హైదరాబాద్ సహకారంతో ఈసీజీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)” పై ఈ శిక్షణ అందించారు.

​ఈ వర్క్‌షాప్‌లో కిట్స్‌కార్ట్  సీఎండీ జి. సూర్యప్రకాష్ ముఖ్య శిక్షకుడిగా వ్యవహరించారు. ఐఓటీ ద్వారా డేటాను సేకరించి, ఏఐ సాయంతో విశ్లేషించి సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఆయన ఉదాహరణలతో వివరించారు. స్మార్ట్ వ్యవసాయంలో నేలలోని తేమను బట్టి నీటిని పారించే విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు, సాంకేతిక నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి ఈ టెక్నాలజీ శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ… రోజురోజుకూ విస్తరిస్తున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ… ఈ శిక్షణ విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఈసీఈ  విభాగాధిపతి డాక్టర్ పాముల శేఖర్ బాబు మాట్లాడుతూ…  సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పుడు వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యత పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, హెటెరో గ్రూప్ అధినేత, కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద  వర్చువల్ విధానంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, కో-ఆర్డినేటర్లు పి. నాగశేఖర్, ఎం. వరప్రసాద్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -