అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు ప్రతినిధులుగా పేట కవులు

– కాళికాంబా సప్తశతి పై పత్రం సమర్పించిన సిద్దాంతం
– కవి సమ్మేళనంలో పాల్గొన్న మడిపల్లి
నవతెలంగాణ – అశ్వారావుపేట
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30 వ వార్షికోత్సవం సందర్భంగా,జాతీయ స్థాయిలో  ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ దంటు కళాక్షేత్రంలో రెండు రోజులు పాటు నిర్వహించిన అఖిల భారత తెలుగు జాతీయ సదస్సులో రెండో రోజు ఆదివారం అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ కవి,రచయిత, సాహితీ విశ్లెషకులు సిద్దాంతపు ప్రభాకరాచార్యులు,సామాజిక మాద్యమ కవి,విశ్లేషకులు మడిపల్లి వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు. ఇందులో 14 వ వేదిక పై కాళికాంబా సప్తశతి లో ప్రకృతి తత్వం పై ప్రభాకరా చార్యులు పత్రం సమర్పించారు.అంతర్జాతీయంగా పలు దేశాలు నుంచి వచ్చిన  కవులు చే నిర్వహించ కవి సమ్మేళనంలో మడిపల్లి వెంకటేశ్వరరావు కవితా గానం  చేసారు. ఈ సదస్సులో వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు,ప్రముఖ రచయిత వంగూరి చిట్టి న్ రాజు,హెచ్. సి.యు వైస్ ఛాన్సలర్ బేతవోలు రామబ్రహ్మం,ఓలేటి పార్వతీశం,భువన చంద్ర,మంగిపూడి రాధిక,జయ పీసపాటి తదితరులు పాల్గొన్నారు.
Spread the love