Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా ఆవులను తరలించకుండా నిఘా పెట్టండి..ఎస్సైకి వినతిపత్రం

అక్రమంగా ఆవులను తరలించకుండా నిఘా పెట్టండి..ఎస్సైకి వినతిపత్రం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: ఈ నెలలో జరగబోయే బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో గల దేవాలయాలకు చెందిన ఆవులను అక్రమంగా తరలించకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్సై మోహన్ రెడ్డికి వినత్పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా మద్నూర్ మండల కేంద్రంలో గోశాల కు చెందిన ఆవులు బాగా గ్రామంలో తిరుగుతుంటాయని వీటితో పాటు పలు గ్రామాల్లో దేవాలయాలకు వదిలిన ఆవులు గ్రామాల్లో ఉండే వాటిని బక్రీద్ పండుగ సందర్భంగా కొందరు అక్రమార్కులు ఆవుల పైన దృష్టి పెట్టి తరలించే ప్రయత్నం చేస్తారని అలా జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ శాఖ బక్రీద్ పండుగ పూర్తి అయ్యేవరకు దేవాలయాల గోవుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్సైకి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ లక్ష్మీ నారాయణ, గోశాల చైర్మన్ గాండ్ల సంజయ్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్ప తుకారం, చిన్న ఎక్లార గ్రామ సర్పంచ్ మాధవరావు, పెద్ద షక్కర్గా గ్రామ పెద్దలు హనుమంతరావు, బిజెపి మండల మాజీ అధ్యక్షులు హనుమాన్లు, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -